స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రి ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రిలో కొంతకాలం క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందేలా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం కొంతమంది విరాళాలను సైతం అందించడం జరిగింది. బాలయ్య తండ్రి ఆశయాలతో ఈ ఆస్పత్రిని స్థాపించారు.
 
ఈ ఆస్పత్రి తన తండ్రి కలల సాకారం అని బాలయ్య చెప్పుకొచ్చారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అత్యుత్తమ చికిత్స కోసం ఈ ఆస్పత్రి పని చేస్తోందని ఆయన అన్నారు. 2000 సంవత్సరంలో 110 బెడ్లతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి ప్రస్తుతం 650 బెడ్లతో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆస్పత్రిగా గుర్తింపును సొంతం చేసుకోవడం కొసమెరుపు. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో క్యాన్సర్ పరిశోధనలను మరింత అభివృద్ధి చేసే దిశగా బాలయ్య అడుగులు వేస్తున్నారు.
 
క్యాన్సర్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రీసెర్చ్ సైతం అదే స్థాయిలో పెరగాలని బాలయ్య ఆశిస్తున్నారు. దేశంలోనే రెండో బెస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి బసవతారకం ఆస్పత్రి కాగా ఇలాంటి అరుదైన ఘనత సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే. సబ్సిడీ రేట్లతో చికిత్స అందించడం బసవతారకం ఆస్పత్రి ప్రత్యేకత అని చెప్పవచ్చు.
 
వేల సంఖ్యలో క్యాన్సర్ రోగులకు సాధారణ జీవితాన్ని ప్రసాదించడంలో ఈ ఆస్పత్రి కీలక పాత్ర పోషించింది. అమరావతిలో సైతం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి దిశగా బాలయ్య అడుగులు వేస్తున్నారు. మనో ధైర్యంతో ఉంటే క్యాన్సర్ బాధితులు సులువుగా కోలుకుంటారని బాలయ్య చెబుతున్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినా చెప్పుకోకపోవడం బాలయ్య ప్రత్యేకత అని చెప్పవచ్చు. బాలయ్య ఆస్పత్రిలో చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు వస్తుండటం కొసమెరుపు. బాలయ్య ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: