పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్  ఇప్పుడు ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీతో సక్సెస్ అయి డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగిపోయాయి. దేశంలోనే పవన్ కళ్యాణ్ కి మంచి ఇమేజ్ ఏర్పడింది. అయితే అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల సినిమా అనేక అడ్డంకులు పడుతూ ఇబ్బందుల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా జూన్ 12న విడుదలని చెప్పి ఆ విడుదల తేదీని కూడా వాయిదా వేసేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన జ్యోతి కృష్ణ ఓ ప్రైవేట్ ఈవెంట్ పెట్టారు. 

అయితే ఈ ఈవెంట్ కీ యాంకర్ ఉదయభాను వచ్చి పవన్ కళ్యాణ్ పరువు తీసేసింది.ఎందుకంటే ఈ ఈవెంట్లో జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టాం.దాదాపు 250 కోట్ల వరకు ఖర్చయింది కావచ్చు.అలాగే ఈ సినిమాలోని ఒక పాట పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం.ఆ పాట ఆయన దాదాపు 500 సార్ల వరకు చూసి ఉంటారు..అంటూ లైవ్ లోనే ఆ పాటని ప్లే చేయించారు. అయితే అదే సమయంలో అక్కడున్న ఉదయభాను పవన్ కళ్యాణ్ పరువు గంగలో కలిపేసింది. ఎందుకంటే పాట ప్లే చేస్తుండగా మధ్యలోకి వచ్చి పవన్ కళ్యాణ్ 500 సార్లు ఆ పాటను చూశారంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పాట పాడే ఉంటారు.

ఆ రహస్యాన్ని మీరు దాచేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాడిన ఆ పాట ఏంటో మీరు చెప్పాల్సిందే అంటూ మాట్లాడింది. దీంతో పవన్ కళ్యాణ్ పరువు మొత్తం పోయింది. అయితే ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన మాటలు ఏమున్నాయని మీరు అనుకోవచ్చు.కానీ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే పాట పాడారు.ఈ పాట కూడా ఎప్పుడో విడుదలైంది.అయితే అలా విడుదలైన విషయం కూడా ఉదయభానుకి తెలియకపోవడం నిజంగా పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులకి అవమానమే అంటున్నారు చాలామంది ఈ వీడియో చూసిన నెటిజన్స్..

అంత పెద్ద భారీ హైప్ తో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి అనే పాట పవన్ పాడారని,అది ఎప్పుడో విడుదల అయింది అనే విషయం కూడా ఉదయ్ భానుకి తెలియదని,ఇండస్ట్రీకి సంబంధం ఉన్న ఉదయభానుకే ఈ విషయం తెలియకపోతే మామూలు జనాలకు ఎలా తెలుస్తుంది అని ఈ వీడియో కింద పవన్ అంటే పడని నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉదయభాను ఈవెంట్ మధ్యలో అత్యుత్సాహం చూపించి పవన్ కళ్యాణ్ పరువు అయితే తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: