పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు నుండి క్రిష్ తప్పుకున్నాడు. దానితో ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు పూర్తి చేశాడు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్క్స్ పెండింగ్ ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేస్తున్నట్లు , కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అందులో ఈ సినిమా దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ... ఈ మూవీ ని మొత్తం గా 250 కోట్ల బడ్జెట్ తో రూపొందించాం అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలో బందర్ పోర్ట్ ను ఏఐ టెక్నాలజీతో రూపొందించాం. అందుకు మొత్తంగా రెండు సంవత్సరాల సమయం పట్టింది అని చెప్పాడు.

అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమాను మూడు సార్లు చూశారు అని , చూసి సినిమా అద్భుతంగా ఉంది అని నన్ను ఎంతగానో పొగిడారు అని చెప్పుకొచ్చాడు. అలాగే తనతో మరో సినిమా పనిచేయాలని ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు. అలాగే పవన్ గారు నన్ను ఎంతగానో నమ్మాడు. ఆయనతో సినిమా చేసే అదృష్టం వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: