జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల్లోనే కాదు సహాయం చేయడంలో కూడా ఒక అడుగు ముందే ఉంటారు.. అలా ఎన్టీఆర్ తనతో కలిసి నటించిన చాలామంది ఆర్టిస్టులకు ఎవరికి తెలియకుండా రహస్య సహాయం చేశాడు.అలాగే తన అభిమానులకు కూడా ఆయన చేయూత అందిస్తూ ఉంటాడు. అయితే అలాంటి ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉండే ఓ నటుడు చనిపోతే ఆయన ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసి తన గొప్ప మనసు చాటుకున్నారట. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఏ నటుడి కూతుర్ల పెళ్లిళ్లు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. ఆయన ప్రస్తుతం గ్లోబల్ రేంజ్ కి ఎదిగారు.

 అయితే అలాంటి ఎన్టీఆర్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో  నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో నేను ఇప్పటివరకు నటించలేదు. కానీ మా ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బాబాయ్ అంటే ఎన్టీఆర్ తల్లి శాలిని వాళ్ళ సిస్టర్ భర్త రాజా కూడా నటుడే. ఆయన కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసారు. ఇక రాజా నేను ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్.అయితే రాజా మరణించాక ఆయన ఇద్దరు కూతుర్ల బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నారు.

అలా తన పిన్ని ఇద్దరు కూతుర్లకు తండ్రి లేకపోయినా తండ్రి లేని లోటును తీర్చి ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు.అలా ఒక అన్నగా తన బాధ్యతను గొప్పగా చాటుకున్నారని చెప్పవచ్చు.ఈ రోజుల్లో తోడబుట్టిన చెల్లెల్ని కూడా పట్టించుకోని మనుషులు ఉన్నారు. అలాంటిది తన తల్లి సోదరి పిల్లల కోసం ఎన్టీఆర్ ఎంతో గొప్ప మనసు చాటుకున్నాడు అంటూ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు నటుడు అశోక్ కుమార్. ఇక ఈయన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం ఎలాంటిదో మరొకసారి బయటపడింది

మరింత సమాచారం తెలుసుకోండి: