ఈ ఏడాది థియేటర్లలో విడుదలవుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో కుబేర సినిమా ఒకటి. సింగిల్ తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న సినిమాలు అంచనాలు అందుకోలేకపోయినా కుబేర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. కుబేర ఆంధ్ర హక్కులు రికార్డు రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.
 
నాగ్ ఈ సినిమాలో నటిస్తుండటం వల్లే ఆంధ్ర హక్కులు భారీ రేటుకు పలికినట్టు సమాచారం. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో మ్యాజిక్ చేసిన శేఖర్ కమ్ముల ఈ సినిమాతో అంతకు మించి మెప్పించడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రాన్స్ ఆఫ్ కుబేర టైటిల్ తో విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల హృదయాలను మెలిపెట్టే కథనంతో ఈ సినిమాను తెరకెక్కించారని వచ్చిన అప్ డేట్స్ ద్వారా అర్థమవుతోంది.
 
ఈ నెల 20వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజవుతుండగా తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో కుబేర సంచలనాలు సృష్టిస్తోంది. నాగార్జున ఈ సినిమాలో నటించడంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథను మలుపు తిప్పే అద్భుతమైన పాత్రలో నాగ్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
 
అభిమానులు కుబేర మూవీ ట్రైలర్, బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రఘువరన్ బీటెక్, సార్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని తెలుస్తోంది. వరుస విజయాల రష్మిక ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమాతో శేఖర్ కమ్ముల పేరు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారు మ్రోగుతుందేమో చూడాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి సిద్ధమవుతున్న కుబేర మూవీ ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: