తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో గోపీచంద్ మాలినేని ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే మొట్ట మొదటి సారి ఈ దర్శకుడు హిందీ లో సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే హిందీ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు.

ఇకపోతే తెలుగు దర్శకుడు దర్శకత్వం వహించిన సినిమా కావడం , అలాగే ఈ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు నిర్మించడంతో ఈ మూవీ ని కచ్చితంగా తెలుగు లో విడుదల చేస్తారు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయలేదు. కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల చేశారు. ఈ మూవీ బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ని నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో హిందీ తో పాటు తెలుగు లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు.

మూవీ తెలుగు వర్షన్ కి నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతుంది. దానితో చాలా మంది మైత్రి సంస్థ వారు మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు వచ్చేవి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: