
ఈ టీజర్ లో అఘోర పాత్రలో బాలయ్య మరోసారి తన ఊచకోతను కంటిన్యూ చేస్తూ రచ్చ రంబోల చేశాడు .. ‘‘శివుడి అనుమతి లేనిదే యముడు ప్రాణాలు తీయడు .. అలాంటిది నువ్వు అమాయకులను చంపేస్తావా..’’ .. అంటూ బాలయ్య విలన్ గ్యాంగ్ ను ఊచ కొత్త కోస్తున్న సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి .. నందమూరి తమన్ అందించిన బిజిఎం మరోసారి థియేటర్లో స్పీకర్లు పగిలిపోటం ఖాయం అనేలా టీజర్ ను చూస్తుంటేనే అర్థమవుతుంది .. ఇక మరి ఏదేమైనా బోయపాటి శ్రీను బాలయ్య తో కలిసి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు .. అలాగే ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ లో క్లారిటీ ఇచ్చారు .. ఇక మరి ఈ బాలయ్య బర్త్ డేకు అఖండ 2 తాండవం అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టే విధంగానే ఉంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..