టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమంది హీరోయిన్స్ సైతం ఎందుకో పెద్దగా అవకాశాలు రావడంలో లక్  కలిసి రావడం లేదు. అయినా కూడా తమ టాలెంట్ తో ఎలాగోలాగా ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నారు. అలాంటివారిలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు..తమిళంలో పుట్టి పెరగడం వల్ల సినీ నేపథ్యమున్న  బ్యాక్ గ్రౌండ్ కావడం చేత తక్కువ సమయంలోనే హీరోయిన్గా గుర్తింపు సంపాదించి ఎన్నో చిత్రాలలో నటించింది తమిళ్ ,మలయాళం, కన్నడ, తెలుగు వంటి చిత్రాలలో కూడా నటించింది.


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఐశ్వర్య రాజేష్సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే తెలుగు ప్రేక్షకులను తన కట్టు బొట్టుతో ఆకట్టుకున్న ఈ అమ్మడు లేటుగా అయినా హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఈమె పాత్రకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈమే కెరియర్లో ఇంత సక్సెస్ అందుకోలేదు ఐశ్వర్య రాజేష్. అయితే అప్పటినుంచి ఈ అమ్మడికి మరొక అవకాశం కూడా రాలేదట. సూపర్ హిట్ కొట్టినప్పటికీ కూడా అవకాశాలు రాకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


తమిళంలో ఏకంగా మూడు సినిమాలలో నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ ఇందులో ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నదట. మరో రెండు సినిమాలు షూటింగ్ సెట్లో ఉన్నాయని.. అలాగే ఒక కన్నడ సినిమా కూడా చేస్తోంది. తెలుగులో మరిన్ని చిత్రాలు తీయాలని ఐశ్వర్యారాయ్ అభిమానులు కోరుతున్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. ఐశ్వర్య రాజేష్ మాత్రం ఒకవైపు కోలీవుడ్ మరొకవైపు తెలుగు నుంచి వచ్చే అవకాశాలను వదులుకోలేదు. చిరంజీవి నటించిన 157వ చిత్రంలో  ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడినట్టే అని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇందులో నయనతారని ఫిక్స్ చేయడం జరిగింది. మరి సెకండ్ హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటించే అవకాశం ఉందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: