కోలీవుడ్ నటుడు ధనుష్ తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... నాగార్జున ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తూ వస్తున్నారు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. దానితో ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఎన్ని కోట్ల బడ్జెట్ ఖర్చు అయ్యింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు దాదాపు 120 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు భారీ ఎత్తున ఓ టి టి డీల్ జరిగినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు ఈ సినిమా యొక్క అన్ని భాషల ఓ టీ టీ హక్కులను ఏకంగా 47 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ మూవీ కి సాటిలైట్ , మ్యూజిక్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు పెద్ద ఎత్తున థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: