హిందీ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటులలో ఆమీర్ ఖాన్ ఒకరు. ఇకపోతే తాజాగా ఆమీర్ ఖాన్ "సితారే జమీన్ పర్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జూన్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ కి జోడి గా జెనీలియా నటించింది. అమీర్ ఖాన్ మరియు జెనీలియా మధ్య వయసు తేడా అత్యంత ఎక్కువగా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం అమీర్ ఖాన్ వయస్సు 60 సంవత్సరాలు కాగా , జెనీలియా వయస్సు కేవలం 37 సంవత్సరాలు. దానితో వీరిద్దరి మధ్య దాదాపు 23 సంవత్సరాల వయసు తేడా ఉంది.

దానితో అనేక మంది ఆమిర్ ఖాన్ మరియు జెనీలియా మధ్య వయసు తేడా చాలా ఎక్కువగా ఉంది. అమీర్ ఖాన్ , జెనీలియా ఇద్దరూ కలిసి జోడిగా సితారే జమీన్ పర్ సినిమాలో నటించారు , వారి మధ్య వయసు తేడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దానితో తాజాగా ఆమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మరియు జెనీలియా మధ్య ఉన్న వయస్సు తేడా గురించి సమాధానం ఇచ్చాడు. సితారే జమీన్ పర్ సినిమాలో నేను మరియు జెనీలియా ఇద్దరం కూడా 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల పాత్రలలో నటించాం. దానిని బట్టి చూసుకుంటే ప్రస్తుతం జనీలియా వయస్సు అందుకు సమానంగానే ఉంటుంది.

ఇక నా వయసు విషయానికి వస్తే ఆ పాత్రకు నా వయస్సు కాస్త సరి సమానంగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మనకు ఎంతో టెక్నాలజీ ఉంది. దానితో మేమిద్దరం కూడా సరి సమాన వయస్సు వ్యక్తుల్లా కనిపించే అవకాశం ఎంతగానో ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే సితారే జమీన్ పర్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ఛాంపియన్స్ అనే సినిమాకు రీమేక్ గా రూపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: