యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించాడు. ప్రస్తుతం తారక్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే కెరీర్ బిగినింగ్లో తారక్ కి అదిరిపోయే రేంజ్ మాస్ ఫాలోయింగ్ ను తెచ్చి పెట్టిన సినిమాలలో ఆది మూవీ ఒకటి. ఈ సినిమాలో కీర్తి చావ్లా , తారక్ జోడిగా నటించగా ... వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా తారక్ మాస్ ఆడియన్స్ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఈ సినిమాలో కీర్తి చావ్లా తన అందంతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు భారీ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమలో క్రేజ్ దక్కింది. కానీ ఆ తర్వాత ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ సినిమాలో అవకాశాలు దక్కలేదు. అలాగే ఆది మూవీ తర్వాత ఈమెకు ఆ సినిమా స్థాయి విజయాలు కూడా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర తగ్గలేదు. దానితో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. 

అలాగే ఈమె మెల్ల మెల్లిగా తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో కొన్ని వైరల్ కూడా అవుతున్నాయి. ఇకపోతే ఆది సినిమా తో పోల్చినట్లయితే ఈ ముద్దుగుమ్మలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kc