బాలయ్య బర్త డే కి పర్ఫెక్ట్ ట్రీట్ ఇచ్చింది నందమూరి అభిమానులకి భువనేశ్వరి అంటూ సోషల్ మీడియా వేదికగా నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు . టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. తన 65వ పుట్టినరోజు ను చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బాలయ్య.  కానీ నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య పుట్టినరోజును సాదాసీదాగా జరపడం లేదు. భారీ భారీ కేక్ లు ఆర్డర్ చేసి కేక్ కట్ చేస్తూ జై బాలయ్య అంటూ భారీ భారీ ఫ్లెక్సీలతో ఆయన బర్తడేను ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు .

సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ స్టార్స్.. స్టార్ సెలబ్రిటీస్ ఆయన శ్రేయోభిలాషులు ఫ్యాన్స్ .. బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . ఇందులో భాగంగానే ఆయన సోదరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి బాలయ్యకు స్పెషల్గా శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు . ఈ ట్విట్ లో బాలయ్యను ఆమె ఏమని పిలుస్తుందో అన్న విషయం బయట పడిపోయింది . ఇన్నాళ్లు బాలయ్యని భువనేశ్వరి ఎలా పిలుస్తుంది ..? వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మనం కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తున్నాము. వీళ్ళు చాలా చక్కగా ఉంటారు .

మరి భువనేశ్వరి - బాలయ్యను ఏమని పిలుస్తుంది ..?? అనే డౌట్ అందరికీ ఉండింది.  ఇన్నాళ్లకు ఆ డౌట్ క్లియర్ చేసేసింది భువనేశ్వరి. " నాన్న గారి నట వారసత్వంతో పాటు మంచి మనసు.. కొంచెం చిలిపితనం ఎంతో క్రమశిక్షణ దైవ భక్తి కలగలిసిన మన అందరి అభిమాన నటుడు మా బాల అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు " అంటూ ట్విట్ చేసింది.  " బాల అన్నయ్య" అంటూ భువనేశ్వరి తన అన్నని పిలుస్తుంది అన్న విషయం ఇప్పుడు బయటపడింది . సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ని బాగా షేర్ చేస్తున్నారు జనాలు . కాగా బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నిన్న విడుదల అయ్యింది. ఇది సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది . సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా యూట్యూబ్లో దుమ్ము దులిపేస్తుంది..!



 

మరింత సమాచారం తెలుసుకోండి: