
ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ అడవి నేపథ్యంలో జరిగే స్టోరీ అని అందరికీ తెలిసిందే. అలాగే ఇండియానా జోన్స్ స్పూర్తితో కథను తయారు చేశామని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో చెప్పటం గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా బయటికి వచ్చిన లీక్ ఏమిటంటే దీనికి రామాయణంకి ముడిపెట్టారట . అది ఎలా అంటే మేరు పర్వతం గుర్తుందిగా . ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణపాయం కలిగితే తనను బ్రతికించడానికి సంజీవిని మూలికలు కావాలని సూసేన వైద్యుడు చెబుతాడు .. దాంతో అవి తాగడానికి వెళ్లిన హనుమంతుడు వాటిని గుర్తించలేక మొత్తం పర్వతాన్ని ఎత్తుకు వచ్చి లక్ష్మణున్ని కాపాడుతాడు ..
ఇక ఇప్పుడు సంజీవిని మూలికలే మహేష్ , రాజమౌళి మూవీలో కీలక ట్విస్ట్ కి కారణం అవుతాయట .. అలాగే మహేష్ వాటిని తెచ్చేందుకు అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్ .. ఇది నిజమో కాదో కానీ వింటేనే మంచి హైప్ వచ్చేస్తుంది . అసలు ఎవరు ఊహించని అల్లూరి సీతారామరాజు , కొమరం భీం కాంబో ని సాధ్యం చేసిన రాజమౌళి ఇప్పుడు సంజీవని ఫారెస్ట్ అడ్వెంచర్లు చూపించడం పెద్ద విషయం కాదు .. త్వరలోనే ఆఫ్రికా వెళ్లబోతున్న మహేష్ , రాజమౌళి టీం అక్కడ కూడా ఎన్నో కీలకమైన సన్నివేశాలని తెర్కెక్కిస్తారు .. 2027 చివరలో ఈ సినిమాను విడలు చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు .