అక్కినేని నాగార్జున విషయంలో ధనుష్ చేసిన పనికి చాలామంది అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు..అంతేకాదు ఇంత హెడ్ వెయిట్ పనికిరాదు అంటూ ధనుష్ ని సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తున్నారు. మరి ఇంతకీ ధనుష్ చేసిన ఆ పనేంటి.. ఎందుకు అక్కినేని అభిమానులు ఆయన్ని సోషల్ మీడియాలో తిడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ధనుష్ హీరోగా నాగార్జున కీ రోల్ పోషించిన తాజా మూవీ కుబేర.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా జూన్ 20న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక పాటని ముంబై వేదికగా రిలీజ్ చేశారు.

అయితే ముంబైలో జరిగిన కుబేర మూవీ ఈవెంట్లో నాగార్జున, ధనుష్,శేఖర్ కమ్ముల,రష్మిక మందన్నా తో పాటు సినిమాకి సంబంధించిన ఇతర తారాగణం కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి ధనుష్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకు వేరే సినిమా షూటింగ్ ఉండడం కారణంగా అందరికంటే ముందే స్టేజ్ మీద కుబేర మూవీ గురించి మాట్లాడి తొందరగానే వెళ్ళిపోయాడు. అయితే అలా మాట్లాడి వెళ్లిపోవడంలో తప్పేముంది..ఆయన సినిమా ఆయన చూసుకోవాలి కదా అనుకుంటారు మీరంతా.. కానీ ఆయన మాటల్లోనే ఉంది అసలు తప్పు..

అదేంటంటే.. ధనుష్ స్టేజ్ మీద మాట్లాడుతూ రష్మిక గురించి శేఖర్ కమ్ముల గురించి కుబేర గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ నాగార్జునని మాత్రం పట్టించుకోలేదు. మాట వరుసకైనా నాగార్జున పేరు చెప్పలేదు. దీంతో నాగార్జున అభిమానులు అందరూ ధనుష్ పై ఫైర్ అవుతున్నారు. ఆయన స్టార్డం ముందు నీ స్టార్డం ఆవగింజంత కూడా ఉండదు. అలాంటిది ఒక గొప్ప హీరోని స్టేజ్ మీదే అవమానిస్తావా.. నీకు అంత హెడ్ వెయిటా.. అంత బలుపా అంటూ అక్కినేని  అభిమానులు ధనుష్ పై మండిపడుతున్నారు.

కనీసం మాటవరసకైనా నాగార్జున పేరుని ప్రస్తావించలేదు.. అలాంటి దిగ్గజ హీరో నీ సినిమాలో నటించడమే గొప్ప. నటించినందుకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు అంటూ ధనుష్ పై కొంతమంది  నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.అయితే రీసెంట్ గా కుబేర మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్లో నా పై నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుందని, అది ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు అని అన్నారు ధనుష్. అయితే ప్రస్తుతం నాగార్జున విషయంలో ధనుష్ పై కామెంట్స్ చేసే వాళ్ళు కూడా అక్కినేని ఫ్యాన్స్ ముసుగులో ఉన్న నెగిటివ్ బ్యాచ్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: