తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు అనే సినిమాతో సినిమా నిర్మాణ రంగం లోకి అడుగు పెట్టారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో మైత్రి సంస్థకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యానర్ వారు నిర్మించిన జనతా గ్యారేజ్ , రంగస్థలం సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే మైత్రి నిర్మాణ సంస్థకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.

ఇక అప్పటి నుండి వీరు వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ , అందులో అనేక సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్లో ముందుకు సాగిపోతున్నారు. ఇకపోతే మైత్రి సంస్థ వారు ఈ మధ్య కాలంలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగా కొంత కాలం క్రితం తమిళ నటుడు అజిత్ కుమార్ హీరోగా తమిళ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాను నిర్మించారు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే మైత్రి సంస్థ వారు మరో తమిళ సినిమాను తాజాగా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గుడ్ బ్యాడ్ అగ్లీ కాంబోలోనే మరోసారి ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. అజిత్ కుమార్ హీరోగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మరో సినిమాను కూడా మైత్రి సంస్థ నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మైత్రి సంస్థ వారు మరో క్రేజీ తమిళ సినిమాను ఓకే చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: