సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , అందులో నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించనుండడం , లోకేష్ కనకరాజు ఆ సినిమాకు దర్శకత్వం వహించనుండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఈ మూవీ యూనిట్ తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమా థియేటర్ హక్కుల ద్వారా పెద్ద మొత్తంలో రాబట్టాలని ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జీఎస్టీ తో సంబంధం లేకుండా ఏకంగా 45 కోట్ల ధరను రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ మూవీ బృందం కోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కొందరు జిఎస్టి కాకుండా 36 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు , ఇక మరి కొంత మంది జిఎస్టి తో కలుపుకొని 43 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ బృందం మాత్రం జిఎస్టితో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల థియేటర్ బిజినెస్ జరుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 14 న విడుదల కానుంది. అదే రోజు తారక్ నటించిన వార్ 2 అనే హిందీ సినిమా కూడా విడుదల కానుంది. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో కూలీ సినిమాకు అంత ధర పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: