బాలకృష్ణ చాలా విశాల హృదయం కలవడానికి, ఆయన గొప్ప మనసుతో ఎంతోమంది డబ్బు లేని పేదవాళ్లను, అనాధలను చదివించడంతోపాటు వారి ఆలనా పాలనా చూసుకొని ఎంతో గొప్ప స్టేజికి తీసుకువచ్చారని అంటూ ఉంటారు. అయితే అలాంటిదే ఇప్పుడు మనం ఒకటి తెలుసుకుందాం. అదేంటంటే బాలకృష్ణ ఓసారి రామకృష్ణ స్టూడియోలో జరిగే జంతర్ మంతర్ మూవీ షూటింగ్ చూడడానికి వెళ్లారు. ఆ టైంలో ఒక బక్క చిక్కిపోయిన అబ్బాయి లైట్ పట్టుకొని ఉన్నారట.అయితే ఆ అబ్బాయి చాలాసేపటి నుండి లైట్ పట్టుకొని ఉండడంతో నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్ కి వచ్చాడట. దాంతో అది చూసిన బాలయ్య చలించిపోయి వెంటనే ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి లైట్ తీసుకొని ఆ పిల్లాడిని పక్కన కూర్చోబెట్టారట. 

ఆ తర్వాత డైరెక్టర్ చూసి ఇదేంటి సార్ మీరు పట్టుకున్నారు అని చెప్పడంతో నువ్వు చేస్తున్న పనేంటి..ఒక చిన్న పిల్లాడితో గంటల తరబడి లైట్ పట్టించుకుంటావా ? రీల్స్ అన్ని తగలబెట్టేస్తా ఇంకొకసారి చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తే.. అని వార్నింగ్ ఇచ్చి ఆ పిల్లాడి తల్లిదండ్రులను వెంటనే నా దగ్గరికి తీసుకురా అన్నారట. అయితే ఆ పిల్లవాడు ఉదయం నుండి ఏమి తినకపోవడంతో చాలా నీరసంగా ఉన్నాడని గ్రహించి వెంటనే కడుపునిండా తిండి పెట్టించాడట. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లిదండ్రులను చూసి బాలకృష్ణ మనసు చలించి పోయింది. ఎందుకంటే ఆ అబ్బాయి తల్లి మూర్చ రోగం తండ్రి పక్షవాతంతో చాలా పేదరికంలో ఉన్నారు.

ఇక ఈ విషయం తెలిసి ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఇద్దరికీ మెరుగైన వైద్యం చేయించి ఆ అబ్బాయిని తార్నాకలో ఉండే శిశు మందిర్ లో చేర్పించి చదువుపించారట. ఎన్నో కష్టాలు అనుభవించిన ఆ చిన్నపిల్లాడు కష్టపడి చదివి చివరికి గొప్ప స్టేజికి వచ్చారట. అయితే ఆ పిల్లాడి చదువుకయ్యే ఖర్చు ఆయన తల్లిదండ్రుల బాగోగులు పూర్తిగా బాలకృష్ణనే తీసుకున్నారట. అయితే ఆరోజు బాలకృష్ణ తిండిపెట్టి మరీ చదివించిన ఆ అబ్బాయి ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో సీఐగా పనిచేస్తున్నాడట. పశ్చిమబెంగాల్ లోని బంకురా జిల్లాలో ఆయన సీఐగా పని చేస్తున్నట్టు సమాచారం. అలా బాలకృష్ణ తన గొప్ప మనసుతో ఒక పేద పిల్లవాడిని చదివించి సిఐని చేశారు. ఇక బాలకృష్ణ గొప్ప మనసుకి చాలామంది నందమూరి అభిమానులు హ్యాట్సాఫ్ అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: