తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన చాలా సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించాడు. దానితో ఈయనకు నటుడిగా , దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం విశ్వక్ కి మంచి విజయాలు దక్కడం లేదు. కొంత కాలం క్రితం మెకానిక్ రాఖీ సినిమాతో అపజయాన్ని అందుకున్న విశ్వక్ ఆ తర్వాత లైలా మూవీ తో ప్రేక్షకులను పలకరించి ఆ మూవీ తో కూడా బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం విశ్వక్ "ఫంకీ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి కాయాడు లోహర్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ బ్యూటీని కలిసి ఈ సినిమా కథను వినిపించగా ఆమెకు కూడా ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే విశ్వక్ హీరోగా రూపొందుతున్న ఫంకీ సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ అల్లూరి అనే తెలుగు సినిమాలో నటించింది.

మూవీ ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఈ బ్యూటీ తాజాగా డ్రాగన్ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని , మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇకపోతే నిజంగానే ఫంకీ మూవీలో ఈ బ్యూటీకి ఆఫర్ వచ్చినట్లయితే ఆ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: