
ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కానీ నిర్మాతలు మాత్రం ఏకంగా 80 కోట్ల రూపాయలకి డీల్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది.. అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అఖండ 2 పైన ఉన్న హైప్స్ తో భారీ బడ్జెట్ పెట్టామని కాబట్టి కచ్చితంగా 80 కోట్ల రూపాయలకు తగ్గే ప్రసక్తే లేదంటూ తెలియజేస్తున్నారట. ముఖ్యంగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమాల సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.
అలాగే అఖండ 2లో విలన్ గా ఆది పినిశెట్టి నటించబోతున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలై అమాంతం అంచనాలు పెంచేయడంతో ఈ సినిమా విషయంలో మరింత జాగ్రత్త తీసుకొని మరి ముందుకు వెళ్లాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా నటిస్తున్నది. అలాగే ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. బాలయ్య ఇందులో ద్విపాత్రాభినయంలో మళ్లీ కనిపించబోతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అఖండ 2 సినిమాతో ఓటీటి డీల్ 80 కోట్లకు కుదిరితే మాత్రం సీనియర్ హీరోలలో ఈ రేర్ రికార్డ్ బాలయ్యకే సొంతం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.. మరి కొంతమంది అభిమానులు బాలయ్య సినిమా అంటే అంతే మరి అంటూ కామెంట్ చేస్తున్నారు.