లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తాజాగా థగ్ లైఫ్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... త్రిషమూవీ లో హీరోయిన్గా నటించింది. శింబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 5బివ తేదీన విడుదల అయింది. కానీ ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఏడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో 36.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.10 కోట్లు , కేరళ లో 2.55 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.20 కోట్లు , ఓవర్సీస్ లో 35.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో 40.85 కోట్ల షేర్ ... 83.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 16 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 66.65 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: