కొంత మంది స్టార్ హీరోలు ఒక సినిమా మొదలు పెట్టి అది పూర్తి కావడానికి సమయం దగ్గర పడిన టైమ్ లో మరో మూవీ ని సెట్ చేసుకుంటూ ఉంటారు. ఇక మరి కొంత మంది హీరోలు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు , మూడు సినిమాలను ఓకే చేసి పెట్టుకుంటారు. అలా ఓకే చేసిన సినిమాలకు దర్శకత్వం వహించే దర్శకులకి గనుక మంచి క్రేజ్ ఉన్నట్లయితే ఆ హీరోలు నటించే తదుపరి మూవీలపై సినిమాలు మొదలు కాకముందే అంచనాలు భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటిస్తూ మరో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఇద్దరు దర్శకుల మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తారక్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక కొంత కాలం క్రితమే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీ ని మొదలు పెట్టారు. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇలా ఓ రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న తారక్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్లో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో నాగ వంశీ ఒకరు. ఈయన సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తారక్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు. ఇప్పటికే తారక్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇకపోతే తారక్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ వంశీ మరో సినిమాను కూడా రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా నాగ వంశీ , తారక్ హీరోగా ఇద్దరు టాప్ డైరెక్టర్లతో మూవీలను సెట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: