సాధారణంగా సినిమా ఇండస్ట్రీలలో చాలామంది హీరోయిన్లు బోల్డ్ పాత్రలు చేయాలంటే సంకోచిస్తారు.. కొంతమంది కనీసం లిప్ కిస్ సన్నివేశాలు కూడా చేయడానికి వెనుకడుగు వేసి కొన్ని సినిమాలను క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం నటనే ప్రధాన ధ్యేయంగా భావించి  ఎలాంటి సన్నివేశాలలో అయినా నటించడానికి ముందడుగు వేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమలాపాల్.. ఈమె కథానాయికగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది.. అయితే అలాంటి అమలాపాల్ ఒక సినిమాలో 15 మంది మగవాళ్ళ మధ్యలో బోల్డుగా ఒక సన్నివేశం చేసిందట. 

ఆ టైంలో ఆమె చాలా భయపడిందట.. ఆ సీన్ ఏంటో చూసేద్దామా.. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి చాలా తక్కువ కాలం అవకాశాలు వస్తాయి. సక్సెస్ఫుల్ హీరోలు  కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం కొన్ని రోజులే  ఉండగలుగుతారు. ఆ టైంలోనే ఎంతవరకు వీలైతే అంతవరకు వారి లైఫ్ ను సెట్ చేసుకోవాలి అనుకుంటారు హీరోయిన్స్. అమలాపాల్ కూడా ఉన్న టైంలోనే తన కెరియర్ ను మంచి గాడిలో పెట్టుకుంది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " ఆమె(తమిళ ఆడై)" చిత్ర షూటింగ్ టైంలో 15 మంది మగవాళ్ళు నా చుట్టూ ఉన్నారు.

ఈ సమయంలో వాళ్ళందరినీ నా భర్తగా భావించి నటించాను. ఆ సన్నివేశం చేయడాని కంటే ముందే నిర్మాతలు నాకు ఈ సీన్ గురించి చెప్పారు.. ఎలాగైనా చేస్తాను అని బలంగా ఫిక్స్ అయ్యాను. కానీ ఆ సన్నివేశం చేసేటప్పుడు నాకు చాలా భయమేసింది  అంటూ అమలా పాల్ చెప్పుకొచ్చింది.. ఇక అమలాపాల్ తెలుగులో అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో నాయక్, నాగచైతన్యతో బెజవాడ, నానితో జెండాపై కపిరాజు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: