చాలామంది హీరోలు, విలన్గా  తమ నటన పరంగా భారీ క్రేజీ సంపాదించుకున్న వారు ఉన్నారు. కొంతమంది హీరోలకు రాని ఇమేజ్ కేవలం ఒక్క విలన్ పాత్రలోనే సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరో వినయ్ రామ్ కూడా ఒకరు.. 2007లో వచ్చిన నీ వల్లే నీవల్లే అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషలలో పేరు సంపాదించారు.. ఇక తెలుగులో వాన సినిమాలో నటించిన వినయ్ మరికొంత క్రేజ్ సంపాదించుకున్నారు.


ఆ తర్వాత తమిళంలోనే వరుస సినిమాలలో చేసిన వినయ్ రామ్ హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో వరుణ్ డాక్టర్ అనే చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాతో కూడా మరొక విజయాన్ని అందుకున్నారు వినయ్ రామ్. ఇదంతా ఇలా ఉండగా ఈ స్టైలిష్ విలన్  గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు విమలా రామన్. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి షేర్ చేసే ఫోటోలు కూడా వైరల్ గా మారుతుంటాయి.


విమల రామన్ కూడా హీరోయిన్గా పలు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా మలయాళంలో ఎక్కువ సినిమాలలో చేసినప్పటికీ తెలుగులో గాయం 2, రంగాది దొంగ, చుక్కలాంటి అమ్మాయి తదితర చిత్రాలలో నటించింది. విమలా రామన్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అలా గాండీవదారి అర్జున, రుద్రాంగి వంటి చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. గత కొంతకాలంగా వినయ్ రామ్, విమలా రామన్ ఇద్దరూ కూడా రిలేషన్ లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి త్వరలోనే వివాహ బంధంతో ఒకటి అవుతారేమో చూడాలి. మరి మొత్తానికి సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: