కొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు దర్శకులు అత్యంత వేగంగా సినిమాలను చిత్రీకరించేవారు. ఇక టాప్ దర్శకులు కూడా అదే స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తూ రావడంతో స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ఒక్క సంవత్సరంలో నాలుగైదు విడుదల అయ్యేవి. దానితో థియేటర్లో కలకలలాడేవి. ప్రేక్షకులు కూడా సినిమాలు చూడడానికి అత్యంత ఆసక్తిని చూపించేవారు. ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు ఒక్కో సినిమాను చిత్రీకరించడానికి అత్యంత ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు.

దానితో స్టార్ హీరోలు కూడా కనీసం ఒక్కో సంవత్సరానికి ఒక్కో సినిమాను కూడా ప్రేక్షకుల మందికి తీసుకురాకుండా వెనుకబడి పోతున్నారు. దానితో సినిమా ఇండస్ట్రీ కూడా కష్టాల్లోకి వెళుతుంది అని అనేక మంది అభిప్రాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి మాత్రం ఇప్పటి స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే అత్యంత డిఫరెంట్ గా ఉన్నాడు. ఈయన చాలా స్పీడ్ గా సినిమాలను రూపొందిస్తూ మంచి విజయాలను అందుకుంటు ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి , చిరంజీవి హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ను కొన్ని రోజుల క్రితమే స్టార్ట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఈ మూవీ కి సంబంధించిన చిత్రీకరణ అత్యంత వేగంగా జరుగుతుంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం ప్రారంభం అయింది. ఈ మూవీ రెండు షెడ్యూల్ తాజాగా ప్రారంభం కావడం మాత్రమే కాకుండా పూర్తి కూడా అయింది. 

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇలా జెట్ స్పీడ్ లో అనిల్ , మెగా 157 పనులు పూర్తి చేస్తూ రావడంతో చాలా మంది ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అని మేకర్స్ ప్రకటించారు. కానీ అంతకు చాలా ముందే ఈ సినిమా ఫుల్ గా రెడీ అయ్యలా ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: