సీనియర్ నటుడు హరీష్.. ఈయన పేరు చెప్తే ఇప్పటి సినీ ప్రియులకు తెలియకపోవచ్చు.కానీ 90స్ లో ఈయన అంటే తెలియని వారు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన 13 ఏళ్లకే హీరోగా 15 ఏళ్లకే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అలా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో హీరోగా దాదాపు 280 సినిమాల్లో నటించి చిన్న వయసులోనే అతిపెద్ద స్టార్డం సంపాదించారు. ఇక తెలుగులో ఈయన పేరు వినగానే చాలామందికి గుర్తుకు వచ్చేది రామానాయుడు నిర్మించిన ప్రేమఖైదీ మూవీ.. హరీష్, మాలా శ్రీ కాంబినేషన్లో వచ్చినం ప్రేమఖైదీ మూవీ అప్పట్లో భారీ హిట్ కొట్టడంతో హరీష్ ప్రేమఖైదీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలా తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈయన తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ,కన్నడ సినిమాల్లో కూడా స్టార్ హీరోగా రాణించారు.

అయితే అలాంటి ఈయన 2001 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీలో ఫెయిడ్ అవుట్ అయిపోయారు.ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ అవి కూడా అంతగా హిట్ కాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో 2021లో సంతోషం అవార్డ్స్ లో కనిపించారు. ప్రస్తుతం హరీష్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నో ప్రేమకథా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా 15 ఏళ్లకే పేరు తెచ్చుకున్న హరీష్ ని ఇండస్ట్రీలో ఎవరు తొక్కేసారని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక హరీష్ తెలుగులో నటించిన ప్రేమఖైదీ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేశారు.

అందులో హీరోయిన్గా కరిష్మా కపూర్ నటించింది.ఇక ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో హిందీలో కూడా హరీష్ కి వరుస అవకాశాలు వచ్చాయి.అయితే ప్రేమఖైదీని హిందీలో తీశాక తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదట హరీష్.అంతేకాదు కరిష్మా కపూర్ అప్పట్లో హరీష్ తో చాలా సన్నిహితంగా మెదలడంతో తెలుగులో హరీష్ కి వచ్చే ఆఫర్స్ అన్ని రిజెక్ట్ చేయమందని, అందుకే హరీష్ హిందీ లో సినిమాలు చేశాక తెలుగు ఇండస్ట్రీ వైపు ఎక్కువగా మొగ్గు చూపలేదని అంటూ ఉంటారు.. ఇక ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకొని ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. అయితే ఈయన హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే ప్రేమ పెళ్లి ఇష్యూ ల కారణంగా లైఫ్ లో చాలా డిస్టర్బ్ అయ్యారట. దాంతో సినిమాలను కూడా కూడా పట్టించుకోలేదు అలా ఇండస్ట్రీలో హరీష్ కనుమరుగైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: