సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సందర్భాలలో మాత్రమే ఏదైనా సినిమా యొక్క థియేటర్ హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడుతూ ఉంటుంది. ఇక సాధారణంగా ఓ తెలుగు సినిమాకు తెలుగు నిర్మాతలు పోటీ పడడం సర్వసాధారణం. కానీ ఓ తమిళ డబ్బింగ్ సినిమా కోసం ఏకంగా టాలీవుడ్ కి సంబంధించిన ఆరుగురు బడ నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు హక్కుల కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన ఆరుగురు నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం టాలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకరు అయినటువంటి నాగ వంశీ , అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున , వీరితో పాటు టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు , టాలీవుడ్ హీరో రానా కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆసియన్ సునీల్ మరియు దిల్ రాజు కూడా ఈ మూవీ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మైత్రి మూవీ సంస్థ వారు కూడా ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కూలీ యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు ఈ మూవీ బృందం వారు 45 కోట్ల భారీ ధరను కోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏ సంస్థ వారు దక్కించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: