తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా పేరు తెచ్చుకున్న శ్రీ రామ్ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. డ్రగ్స్ తీసుకున్నట్టు ఆయన పరీక్షల్లో నిర్ధారితం అవ్వడమే కాకుండా కోర్టులో కూడా తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు.తాను ఓ రాజకీయ నాయకుడికి 10 లక్షల అప్పుడు ఇచ్చానని ఆయన డబ్బులు అడిగినప్పుడల్లా నాకు ఓ కొకైన్ పాకెట్ పంపారని, అలా నాకు డ్రగ్స్ అలవాటయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. డ్రగ్స్ తీసుకోవడం నా తప్పే.. నాకు బెయిల్ ఇప్పించండి నా కొడుకుని చూసుకోవాలి అంటూ బెయిల్ కోసం కోర్టుని అభ్యర్థించిన సంగతి కూడా మనకు తెలిసిందే.ఈ విషయం పక్కన పెడితే..డ్రగ్స్ కేసులో శ్రీరామ్ అడ్డంగా దొరకడంతో ఈయన గురించి ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

అయితే శ్రీరామ్ ఓ నటిని తల మీద ఏకంగా గట్టిగా బాదారట.దాంతో ఆమె తల ఉబ్బిపోయిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. నటి ఈశ్వరి రావు అంటే తెలియని వారు ఉండరు. సీనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి, అక్క, అత్త, వదిన పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈశ్వరి రావు శ్రీరామ్ నటించిన పిండం సినిమాలో అన్నమ్మ అనే పాత్రలో నటించింది.. అయితే ఈ సినిమా షూటింగ్లో జరిగిన ఒక సంఘటన గురించి శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పిండం సినిమాలో ఈశ్వరి రావు నటించారు. ఆ సినిమాలో షూటింగ్ సమయంలో నేను ఈశ్వరి రావు ని పూల కుండీతో నిజంగానే కొట్టాను.

 అయితే కథలో భాగంగా ఈశ్వరీ రావు పీక పట్టుకునే వ్యక్తిని నేను కొట్టాలి.కానీ సడన్గా ఆ వ్యక్తిని కాకుండా ఈశ్వరి రావు గారి తలపై ఫ్లవర్ వాజ్ తో గట్టిగా బాదాను. దాంతో ఆమె తల వాచిపోయింది.అయితే నేను భయపడి పోయి హాస్పిటల్ కి తీసుకువెళ్దామని చెప్పినా కూడా ఇంకో షార్ట్ పూర్తి చేసుకొని వెళ్దాం..ఇప్పుడే తల ఇలా వాచింది..రేపటి వరకు తల పూర్తిగా ఉబ్బి పోతే షూటింగ్ చేయడానికి వీలవ్వదు. పర్వాలేదు ఒక షార్ట్ కంప్లీట్ చేసి వెళ్దాం అని ఈశ్వరి రావు గారు అంత గాయం అయినా కూడా సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసింది అంటూ శ్రీరామ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈశ్వరి రావు నటించిన అరవింద సమేత సినిమాలోని ఆమె యాక్టింగ్ కి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: