కన్నప్ప సినిమాపై ఎన్నోఆశ‌లు పెట్టుకున్నాడు హీరో మంచు విష్ణు .. అలాగే ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టేశారు .. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి పూర్తి అయ్యేవరకు ఎంతో కష్టపడ్డారు .. ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున ప్రేక్షకులు ముందుకు రాబోతున్న క్రమంలో ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలోనే చేశారు .. ముంబైలో టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుంచి , హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ప్రతిదీ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్లారు ..


ఇక మంచు విష్ణు కలల డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను రెండేళ్ల క్రితం అఫీషియల్ గా మొదలుపెట్టారు .. కానీ ఈ సినిమా హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రమోషన్స్ లో ఎక్కడ మొఖం కూడా చూపీలేదు .. ఇక కన్నప్ప విష్ణుకే కాదు హీరోయిన్ ప్రీతి ముకుందాన్‌కు కూడా ఎంతో ఇంపార్టెంట్ మూవీ .. ఇప్పటివరకు ఆమె చేసిన రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి .. కన్నప్ప ఈ కోలీవుడ్‌ బ్యూటీ కి మూడు సినిమా కావటమే కాదు మొదటి పాన్ ఇండియా సినిమా కూడా .. ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ బ్యూటీ , గోల్డెన్ లేడీ , లక్కీ గ‌ర్ల్ అన్న‌బిరుదులు కూడా ఈమె ఖాతాలో వచ్చి పడతాయి .. అలాంటిది ప్రీతి ముకుందన్ మూవీ ప్రమోషన్లతో పాటు ఎలాంటి ఇంటర్వ్యూ లోను కనిపించలేదు ..


నార్త్ లోనే కాదు సౌత్ లో జరిగిన ఏ ఈ వెంట్లు కూడా ఈమె కనిపించలేదు .. అదేవిధంగా ఆమె పేరు కూడా పెద్దగా ఎవరు? ప్రస్తావ‌న‌కు తెచ్చిన దాఖలాలు కూడా లేవు .. కాజల్ ది చిన్న రోల్ కాబట్టి లైట్ తీసుకుంది అనుకుంటే .. ప్రీతి ఎందుకు స్కిప్ చేసిందో ఎవరికీ క్లారిటీ లేదు .. చివరికి స్మాల్ రోల్స్‌ చేసిన మొహ‌న్‌లాల్‌, అక్షయ్ కుమార్ , మధుబాల కూడా పలు ఈవెంట్లో పాల్గొని సినిమాపై హైప్‌ తీసుకొచ్చారు .. ఇక మరి షూటింగ్స్ తో బిజీగా ఉండపోయిందా లేదా ఇంకేమైనా కారణాలు అనేది తెలియాల్సి ఉంది .. ఏదైతేనేం కన్నప్ప మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ..

మరింత సమాచారం తెలుసుకోండి: