
కన్నప్ప సినిమాను ముందుగానే చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సినిమా కంటెంట్ ఆసక్తికరంగా ఉందని సినిమాలో ఆశ్చర్యపరిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని కోన వెంకట్ అన్నారు. కన్నప్ప సినిమా చివరి అరగంట చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చివరి 20 నిమిషాలలో మంచు విష్ణు అద్భుతంగా నటించారని కోన వెంకట్ కామెంట్లు చేశారు.
ప్రేక్షకులంతా మంచు విష్ణు నటన గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కన్నప్ప సినిమాలో మోహన్ బాబు అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించారని ఆయన అన్నారు. కన్నప్ప సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి ఈ సినిమా మరిన్ని లాభాలను అందిస్తుందని ఆశిస్తున్నానని కోన వెంకట్ తెలిపారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప సినిమా తెరకెక్కగా 2014 సంవత్సరం నుంచి మంచు విష్ణు ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా సినిమాలో రుద్ర పాత్రలో ప్రభాస్ నటించారు. 3 గంటల 2 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. బాక్సాఫీస్ వద్ద కన్నప్ప ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.