ఇది నిజంగా నందమూరి అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పాలి.  జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కి  ముందు ఐదు వరుస  సక్సెస్ లు అందుకున్నాడు.  ఆ తర్వాత దేవరతో ఇంకో సక్సెస్ అందుకున్నాడు . ఎన్టీఆర్ ట్రాక్ రికార్డు చూసి బాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా షాక్  అయిపోతున్నారు . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ ..ప్రశాంత్ నీల్ తో  "డ్రాగన్" మూవీ చేస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు.  ఆల్రెడీ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేసేసాడు.  ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది . ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి ఫ్యాన్స్ .


ఈ సినిమాకి సంబంధించి ఒక పాట మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉందట.  మిగతాదంతా కంప్లీట్ అయిపోయిందట.  ఈ పాట షూట్ కోసం ముంబై చేరుకున్నాడు ఎన్టీఆర్ . అయితే ఇక్కడే ఎన్టీఆర్ అభిమానులకి మరో గుడ్ న్యూస్ అందించినట్లైంది.  ఎన్టీఆర్ చేతిలో "Muruga: The Lord of war, The god of Wisdom’ (మురుగ: ద లార్డ్ ఆఫ్ వార్, ద గార్డ్ ఆఫ్ విస్డమ్)  అనే పుస్తకం కనిపించింది.  ఇంకేముంది అభిమానులకి ఇది పండుగ అని చెప్పాలి .



త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో అల్లు అర్జున్ కాంబినేషన్ లో లాక్ అయిన ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నాడు అని.. ఆ ప్లేస్ లోకి ఎన్టీఆర్ వచ్చాడు అని ఇన్నాళ్లు సిని వర్గాలలో వార్తలు వినిపించాయి . దాన్ని కన్ఫామ్ చేసేస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో  బుక్ పట్టుకొని ఉండడంతో అభిమానులకిఓ  రేంజ్  గుడ్ న్యూస్ అందించినట్లు అయింది . ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబినేషన్లో కార్తికేయ స్వామికి సంబంధించిన కథతో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా ఇప్పుడు జనాలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు .



ఆల్రెడీ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కన్ఫర్మ్ చేశాడు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం కన్ఫామ్ చేసినట్లయింది.  ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్  వర్క్ ఇప్పటికే పూర్తి చేసేసాడు త్రివిక్రమ్ . వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేశాక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది . ఈ లోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - వెంకటేష్ తో  ఒక సినిమాని కంప్లీట్ చేసేస్తాడట.  త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తెరకెక్కే సినిమా కోసమే ఆ బుక్ చదువుతున్నాడు ఎన్టీఆర్ అని ఆ కారణంగానే చేతిలో ఆ బుక్ ఉందని  సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతున్నారు ఫ్యాన్స్.  మొత్తానికి కార్తికేయుడి రూపంలో  జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు  ఇది నిజంగా నిజంగా వేరే లెవల్ అంటూ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: