యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సైతం ఈ సినిమా ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో మరో సినిమా హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

కార్తికేయ స్వామి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వేర్వేరు కారణాల వల్ల బన్నీ వదులుకున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి తారక్ ఇప్పటికే రీసెర్చ్ మొదలుపెట్టారని అర్థమవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫోటోలో తారక్ మురుగ ద లార్డ్ ఆఫ్ వార్, ద గాడ్ ఆఫ్ విస్డం అనే పుస్తకంతో కనిపించారు. కార్తికేయ స్వామి గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. కార్తికేయ స్వామిని సుబ్రహ్మణ్యస్వామి అని కూడా పిలుస్తారని సంగతి తెలిసిందే. కార్తికేయ పురాణం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. డివోషనల్ టచ్ తో సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకోవడంతో పాటు దేవుడు చరిత్ర తనదైన శైలిలో చెప్పబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాను వేగంగా పూర్తి చేసి ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల కోసం ఎంతో  కష్టపడుతున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: