
వార్2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం మేకర్స్ 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుండగా 70 కోట్ల నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ లెక్కన ఇవ్వమని కోరితే మేకర్స్ ఆ స్థాయిలో ఇవ్వడానికి ఆసక్తి అయితే చూపడం లేదని తెలుస్తోంది. కూలీ సినిమా హక్కులు ఎంత మొత్తానికి అమ్ముడయ్యాయో తెలీదు కానీ నైజాం ఏరియాకు ఆసియన్ సునీల్, కృష్ణా జిల్లాకు బన్నీ వాస్, ఈస్ట్ సురేష్ బాబు, వైజాగ్ దిల్ రాజు చేతుల్లోకి వెళ్లిందని సమాచారం అందుతోంది.
బలమైన డిస్ట్రిబ్యూటర్ల సపోర్ట్ లభించడం ఈ సినిమాకు ప్లస్ అయిందని తెలుస్తోంది. వార్2 సినిమాకు సంబంధించి ఈ స్థాయిలో డిస్ట్రిబ్యూటర్ల సపోర్ట్ దక్కుతుందో లేదో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. వార్2 సినిమాకు కూలీ సినిమాతో గట్టి షాకులు తగులుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూలీ సినిమా కమర్షియల్ గా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
వార్2 సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. వార్2 సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. వార్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో కెరీర్ పరంగా జోరు మీద ఉండగా వార్2 సినిమాతో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.