సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతోకమంది వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో విజయశాంతి ఒకరు. ఈమె 1980 లో కల్లుక్కల్ అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు విజయశాంతి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ఈమె ఇప్పటివరకు ఎన్నో భాషల సినిమాల్లో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకుంది.

మరీ ముఖ్యంగా ఈమె ఎక్కువ శాతం తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ఈమె ఆ తర్వాత ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపించింది. ఈమె ప్రధాన పాత్రల్లో రూపొందిన లేడి ఓరియంటెడ్ సినిమాల్లో చాలా మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. వాటి ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్  కలిగిన హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ తో ఈమె అత్యధిక సినిమాల్లో నటించింది. చిరంజీవితో ఈమె అత్యధికంగా 19 సినిమాల్లో నటిస్తే , బాలకృష్ణతో 16 సినిమాల్లో నటించింది. 

చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరితో విజయశాంతి నటించిన సినిమాలలో చాలా మూవీలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇకపోతే ఈమె చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా రూపొందిన సరేలేరు నేకెవ్వరు సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక తాజాగా ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో నటించింది. ఈ సినిమాలోకి విజయశాంతి , కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సాధించకపోయినా , ఈ మూవీ లోని నటనకు గాను విజయశాంతి కి మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: