కన్నప్ప.. కన్నప్ప.. కన్నప్ప ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా కన్నప్ప సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తోనే సినిమా ఇండస్ట్రీ తిరగరాసేటటువంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది అంటూ కొంతమంది చాలా చాలా హుందాగా తెగించి మరి రివ్యూలు ఇచ్చారు . వాళ్ళందరినీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు కొంతమంది జనాలు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్ అంటూ కన్నప్ప సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు .

సాధారణంగా మన తెలుగులో ఆయా సినిమాల తాలూకా ఫలితాలన్నిటినీ కూడా హిట్ ..సూపర్ హిట్ .. బ్లాక్ బస్టర్ హిట్ .. ఇండస్ట్రీ హిట్ అని రికార్డులు తిరగ రాస్తే తప్పిస్తే పోస్టర్లో వేసుకోరు..  అన్ని సినిమా రికార్డును తిరగ రాసిన మూమెంట్లో మాత్రమే ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ పై వేసుకుంటారు.  కానీ కన్నప్ప మాత్రం మొదటి రోజే ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్స్ వేసేసుకుంది.  కన్నప్ప సినిమా కథ బాగుంది కంటెంట్ బాగుంది.  సినిమా అసలు ఇండస్ట్రీ హిట్ అనాలి అంటే భారీ లాంగ్ రన్ తప్పనిసరి . కానీ సినిమా వచ్చిన మొదటి రోజుకే కరెక్ట్ గా 24 గంటల లోపే మేకర్స్ కన్నప్ప సినిమాని ఇండస్ట్రీ హిట్ అంటూ చెప్పడం ఒకింత ఆశ్చర్యమే అంటున్నారు సినీ ప్రముఖులు .

అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ అనే కోణంతో ఇది వేసి ఉండొచ్చేమో అంటూ సెటైరికల్ గా కూడా కౌంటర్స్ వేస్తున్నారు కొంతమంది జనాలు.  సోషల్ మీడియాలో అసలే మంచు విష్ణు కన్నప్ప సినిమాపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. మరి ముఖ్యంగా హీరో విష్ణు అయినా ప్రభాసే అంత నడిపించాడు అన్న రేంజ్ లో ప్రభాస్ అభిమానులు మాట్లాడుతున్నారు . ఇలాంటి మూమెంట్లో ఇండస్ట్రీ హిట్ అంటూ కొత్త పోస్టర్ రావడంతో జనాలు దీనిపై మరింత స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో పోస్టర్స్ రచ్చ మన తెలుగు సినిమాలలో చాలా కామన్ గానే కనిపిస్తుంది. దీన్ని కూడా అలానే చూస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సీరియస్గా తీసుకుంటే మాత్రం అన్ని తప్పులుగానే కనిపిస్తాయి అంటూ కొంతమంది కామెంట్ పీపుల్స్ కన్నప్ప సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు . మొత్తానికి ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గౌరవం దక్కించుకునేలా విష్ణు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు అంటూ పలువురు విష్ణు నటనను ఆయన టాలెంట్ ను పొగిడిస్తున్నారు..!!
 




మరింత సమాచారం తెలుసుకోండి: