
అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘కన్నప్ప’ మూవీకి డివైడ్ టాక్ రావడంతో ఈవారం కూడ ‘కుబేర’ కలక్షన్స్ కొంతవరకు మెరుగుపడి బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే దీనికి భిన్నంగా ఈసినిమా ఫలితం కోలీవుడ్ లో మరొక విధంగా ఉండటం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. ఈమూవీలో ధనుష్ నటించినప్పటికీ తమిళ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
తమిళ ప్రేక్షకులలో ధనుష్ కు చాల మంచి పేరు ఉంది. అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ ఉంది. ఇండస్ట్రీలో అతడి సినిమాలకు మంచి మార్కెట్ కూడ ఉంది. అతడు స్వీయ దర్శకత్వం వహించి నటించిన ‘రాయన్’ ఏకంగా 150 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. ‘కుబేర’ మూవీకి కాలీవుడ్ మీడియాలో మంచి రివ్యూలు కూడ వచ్చాయి. అయితే ఈమూవీ కలక్షన్స్ విషయంలో చాల వెనకపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈసినిమాకు కోలీవుడ్ లో ఇప్పటివరకు కేవలం 20 కోట్ల కలక్షన్స్ మాత్రమే రావడం మరింత షాకింగ్ గా మారింది. ధనుష్ కెరియర్ లో ఫెయిల్ అయిన సినిమాలకు కూడ ఇంతకన్నా ఎక్కువ కలక్షన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాలీవుడ్ లో వస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ పబ్లిసిటీలో ధనుష్ తో పాటు సమానంగా ప్రాధాన్యత నాగార్జునకు ఇవ్వడంతో ఈమూవీలో హీరో నాగ్ అన్న అభిప్రాయానికి తమిళ ప్రేక్షకులు రావడంతో ఈసినిమాకు ఇలాంటి కలక్షన్స్ వచ్చి ఉంటాయి అన్న అభిప్రాయం కూడ ఉంది. దీనితో షాక్ లో శేఖర్ కమ్ముల ఉన్నాడు అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది..