"కుబేర".. రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన మూవీ . ఒక కోలీవుడ్ హీరో తో ఒక తెలుగు డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా ఎంత ప్రభంజనం సృష్టించింది అనే దాని గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.  మరీ ముఖ్యంగా రష్మిక పర్ఫామెన్స్ అదే విధంగా ధనుష్  బిచ్చగాడిగా నటించినా విధానం అందరినీ ఆకట్టుకున్నింది. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్ అయితే వేరే లెవెల్.  ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . బడా సీనియర్ హీరో ఇలాంటి ఒక క్యారెక్టర్ లో కనిపిస్తాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అభిమానులు .


ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అంటూ అభిమానులు కోరుకుంటున్నారు . అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ అనేది బాగా ట్రెండ్ అవుతూ క్లిక్ అవుతున్నాయి. అయితే కుబేర 2 సినిమాకి కూడా సీక్వెల్ రావాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . అయితే కోలీవుడ్ హీరో ధనుష్ కాకుండా కుబేర 2 సినిమాలో మన తెలుగు హీరో అయితే బాగుంటుంది అంటూ అభిప్రాయపడుతున్నారు . వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు "అల్లరి నరేష్".



తెలుగు ఇండస్ట్రీలో అల్లరి నరేష్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాలా..?  జయాపజయాలకు అతీతంగా అల్లరి నరేష్ తన క్యారెక్టర్ ని ఎలా చూస్ చేసుకుంటాడు అనేది అందరికీ తెలుసు. నేను, గమ్యం ,నాంది ,శంభో శివ శంభో ,  బచ్చలపల్లి వంటి చిత్రాలలో అల్లరి నరేష్ నటన అద్భుతం ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు . అలాంటి అల్లరి నరేష్ కుబేర 2 సినిమాలో నటిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు.  అంతేకాదు శేఖర్ కమ్ముల "కుబేర 2" తెరకెక్కించాలి అని కానీ సినిమాలో ధనుష్ కాకుండా మన తెలుగు హీరో అయిన అల్లరి నరేష్ ని పెట్టుకొని సినిమా చేస్తే బాగుంటుంది అంటూ మాట్లాడుతున్నారు.  చూడాలి మరి శేఖర్ కమ్ముల దీనిపై ఎలా స్పందిస్తాడు అనేది..???

మరింత సమాచారం తెలుసుకోండి: