
ఆ లిస్ట్ లోకే వస్తాడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే సవి. నటన అంటే ఎంతో ఇంట్రెస్ట్ .. ఆ కారణంగానే నటించాలి అంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకున్నాడు. 2013లో అజిత్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఆరంభం" లో ఒక స్పెషల్ పాత్ర అందుకున్నాడు . టెర్రరిస్ట్ గ్యాంగ్ లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించాడు. ఆకట్టుకున్నాడు . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అరాకొరా అవకాశాలు వచ్చాయి .
కానీ పెద్ద అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఆయన లా చదివాడు . అయిన సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ కారణంగా ఈ రంగంలో కి వచ్చాడు. బాలీవుడ్ లో చిన్నా చితకా పాత్రలు పోషించారు . కానీ ఇప్పుడు ఆయనకు అవేవీ ఉపయోగపడలేదు. సవి సింధు ఇప్పుడు రోజుకి 14 గంటలపాటు వ్యాచ్ మ్యాన్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. చిన్న చిన్న అవసరాల తీర్చుకోవడం సవాలు గా మారింది. ఇక థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అన్నా.. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలి అన్నా పరిస్థితి పూర్తి గగనంగా మారిపోయింది అని .. తన ఆవేదన వ్యక్తం చేశారు . అంతేకాదు తనకు ఎవరైన సినీ ప్రముఖులు సాయం అందించకపోతారా అంటూ ఎదురు చూస్తున్నారు. కనీసం మాన్వత్వం ఉన్న మనుషులు అయినా సహాయం చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు..!!