"సమంత" ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటుంది . మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకి చాలా చాలా దూరంగా ఉంటుంది.  హీరోయిన్ సమంత కేవలం బాలీవుడ్ ఆఫర్లు అయితేనే ఓకే చేస్తుంది . కాగా సమంత తన ఫిట్నెస్ గురించి ఎంత వర్కౌట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే సమంత అంత హాట్ గా చూడడానికి చక్కగా ఉంటుంది . కానీ కొంతమంది మాత్రం ఈ మధ్యకాలంలో సమంత బాగా సన్నగా అయిపోయింది అని.. చూడడానికి బాగోలేదు అని అంద వికారంగా ఉంది అంటూ కామెంట్లు పెట్టారు .


చాలామంది ఆమెని ట్యాగ్ చేసి మరీ పోస్ట్ చేస్తూ సన్నబడ్డావు.. నీరసంగా కనిపిస్తున్నావ్..ఒక్క చిక్కి పోయావ్ అంటూ రకరకాలుగా మాట్లాడారు . వీటన్నిటికీ సమంతా కౌంటర్ విసురుతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. జిమ్లో ఫుల్ పుష్అప్స్ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ "నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు మూడు పుష్ అప్ లు పూర్తి చేయగలిగితే తప్ప నన్ను ఇకపై సన్నబడ్డావు అనారోగ్యంగా ఉన్నావు అంటూ చెత్త చెత్త కామెంట్స్ చేయడానికి వీలు లేదు " అనే విధంగా పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది.

 

చాలామంది సమంతని సన్నబడిపోయావు అంటూ వెక్కిరించారు.  వాళ్లకి కౌంటర్ గానే సమంత ఈ పోస్ట్ పెట్టింది అని పూర్తిగా అర్థం అయిపోతుంది. కొంతమంది సమంత ఫ్యాన్స్ దీనిపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  ఇకపై సిగ్గు సరం ఉంటే సమంతని అని తన బరువు విషయం కారణంగా ఎవరు ట్రోల్ చేయరు అంటూ రెచ్చిపోయి మరి సోషల్ మీడియాలో హాట్ గా కామెంట్స్ పెడుతున్నారు.  దీంతో సోషల్ మీడియాలో మరొకసారి హీరోయిన్ సమంత పేరు మారు మ్రోగి పోతుంది.
కాగా రీసెంట్ గానే సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్  అందుకుంది . ప్రొడ్యూసర్ గా కూడా సమంత తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది. త్వరలోనే బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతుంది. అంతే కాదు బాలీవుడ్ లో ఒక సినిమాలో కూడా ఆమె  నటించడానికి రెడీగా ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది..!





మరింత సమాచారం తెలుసుకోండి: