
హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళుతున్న కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం కె "రాంప్" . ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. యుక్తి తార్జ కథానాయికగా ఈ సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాను హాస్య మూవీస్ మరియు రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ మరియు శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు.. కాగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
లుంగీ పట్టుకొని స్టైల్ గా ముందుకు నడుస్తున్న విధానం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. అయితే ఆయన వెనుక భాగంలో ఫైర్ ఎఫెక్ట్ బాటిల్స్ డెకరేషన్ ఉంది . ఇది చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది . ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్టర్ చూసిన జనాలు సేమ్ ప్రభాస్ నటిస్తున్న "ది రాజా సాబ్" లుక్ ని కాపీ చేసినట్లు ఉన్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాజా సాబ్ మూవీ పోస్టర్ లానే ఈ మూవీ పోస్టర్ ఉందే అంటూ ఘాటు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరాని పై ఘాటుగానే మండిపడుతున్నారు రెబల్ అభిమానులు . కొంతమంది ప్రతి ఒక్కడు కూడా మా ప్రభాస్ ట్రెండ్ ఫాలో అవ్వడమే ..ఏ మనుషులో ఏంటో అంటూ ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారు. కానీ కిరణ్ అబ్బవరం ఫాన్స్ మాత్రం చాలా సున్నితంగా దీన్ని తిప్పి కొడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది బ్రో అంటూ కూల్ గా కౌంటర్స్ వేస్తున్నారు. సోషల్ మీడియా లో ప్రజెంట్ కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ వర్సెస్ రెబెల్ ఫాన్స్ మధ్య మాటలు యుద్ధం బాగా వైరల్ గా మారింది..!!