మన సినీ ఇండస్ట్రీలో కోటీశ్వరుడిగా శోభన్ బాబును చెప్పుకుంటారు. ఆయన ముందు ఆలోచనతో ఎన్నో భూములు కొని పెట్టుకున్నారు. అయితే ఆ భూముల విలువ ప్రస్తుతం వేలకోట్ల ధర పలుకుతుంది. అలా శోభన్ బాబు ముందు చూపుతో చేసిన పని ప్రస్తుతం ఆయన పిల్లలకి చాలా లాభాలు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా తాను కష్టార్జితంతో సంపాదించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవారు కాదు. అలాగే చాలామంది హీరోలు స్టార్డం వచ్చాక కోట్లు సంపాదించినప్పుడు లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేస్తారు. కానీ శోభన్ బాబు మాత్రం అందరి హీరోలకు చాలా భిన్నంగా ఉంటారు. ఆయన తన కష్టంతో సంపాదించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఒప్పుకోరు.

అలా ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కోటీశ్వరుడైన హీరోగా శోభన్ బాబుకు పేరు ఉంది.అయితే అలాంటి శోభన్ బాబు ఈ ఆస్తులన్నీ ఓ హీరోయిన్ నుండి కొట్టేసారని, ఆ హీరోయిన్ వల్లే శోభన్ బాబుకి ఆస్తులు అమాంతం పెరిగాయి అంటూ చాలా సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు జయలలిత... సినీ హీరోయిన్ తమిళనాడు మాజీ దివంగత సీఎం అయినటువంటి జయలలిత లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన సంగతి మనకు తెలిసిందే. జయలలిత కి సంబంధించిన పట్టు చీరలు, బంగారు నగలు, డబ్బు, చెప్పులు,వెండి ఇలా ప్రతి ఒక్కటి బయటపడ్డాయి. ఆమె చనిపోయాక ఆమె ఆస్తి కోసం చాలామంది ముందుకు వచ్చారు.

అయితే జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో లక్షల కోట్ల ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆస్తులలో కొన్ని ఆస్తులు శోభన్ బాబు పేరిట కూడా రాసినట్టు సమాచారం.ఎందుకంటే శోభన్ బాబు జయలలిత ఇద్దరు చాలా రోజులు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. పెళ్లి మాత్రం చేసుకోలేదు. అలా శోభన్ బాబుకి ఉన్న ఆస్తులన్నీ జయలలితవే అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు సీనియర్ డైరెక్టర్ హరిచంద్ర.ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శోభన్ బాబు ఎవరి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

 అలాగే జయలలిత ఆస్తులు ఆయన తీసుకున్నారని, జయలలిత పేరు మీద ఉన్న ఆస్తులు శోభన్ బాబుకి రాసింది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.కేవలం జయలలిత కారణంగా తన కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తులను కాపాడుకోగలిగాడు శోభన్ బాబు.కానీ ఆమె ఆస్తులు తీసుకోలేదు. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో శోభన్ బాబు భూములు ఒక్కటి కూడా కబ్జాలకు గురవ్వకుండా చూసుకుంది.అలా శోభన్ బాబు సంపాదించిన ఆస్తులు అన్ని పదిలంగా ఉండిపోయాయి. ఆ ఆస్తులన్నీ  శోభన్ బాబు స్వయంగా తన కష్టార్జితంతో పోగేసుకున్న డబ్బులతో కొనుక్కున్నవి.అవి ఎవరి నుండి వచ్చినవి కావు. ఎవరి నుండి తీసుకున్నవి కావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: