
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అరవింద సమేత వీర రాఘవ సినిమా సంచలన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో మరో సినిమా ఫిక్స్ కాగా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా షూట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో పాటు ఈ సినిమాలో నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
మైథిలాజికల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కు విలన్ గా రానా నటించనున్నారని వైరల్ అవుతున్న వార్తల ద్వారా క్లారిటీ వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ రానా కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే మాత్రం ఆ సినిమా సంచలనం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ సినిమా కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కార్తికేయ స్వామి కథతో తెరకెక్కుతున్న ఈ కథాంశంలో ఆసక్తికర ట్విస్టులు సైతం ఉండనున్నాయని తెలుస్తోంది.
త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ తర్వాత ఆ స్థాయి లైనప్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాగా 2029 వరకు డేట్స్ అందుబాటులో లేవని తెలుస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.