టాలీవుడ్ యువ నటుడు నితిన్ "జయం" అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. నితిన్ కి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను తీసుకువచ్చిన సినిమాలలో దిల్ సినిమా ఒకటి. ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ తోనే నిర్మాతగా దిల్ రాజు కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తో ఈయనకు మంచి విజయం దక్కడంతో ఈయన పేరు లోనే ఈ సినిమా పేరు కలిసిపోయింది.

అంతలా ఈయనకు ఈ మూవీ గుర్తింపును తీసుకువచ్చింది. ఇకపోతే 2003 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సీక్వెల్ గురించి తాజాగా దిల్ రాజు ఓపెన్ అయ్యాడు. తాజాగా దిల్ రాజు "దిల్" సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ... ఒక వేళ దిల్ సినిమా సీక్వెల్ చేయాల్సి వస్తే తండ్రి కొడుకు ఇద్దరి పాత్రలలో నితిన్ నటిస్తే దిల్ మూవీ కి సీక్వెల్ ను నిర్మిస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా నితిన్ "తమ్ముడు" అనే సినిమాలో హీరోగా నటించాడు.

వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా... వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో దిల్ రాజు ఈ మూవీ ని అద్భుతమైన రీతిలో ప్రమోట్ చేస్తున్నాడు. మరి ప్రస్తుతానికి నితిన్ వరుస అపజయలతో ఉన్నాడు. తమ్ముడు మూవీ తో సక్సెస్ను అందుకొని ఈయన తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: