టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఈమె ఛలో అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన గీత గోవిందం సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో కూడా చాలా శాతం మూవీలు మంచి సక్సెస్లను సాధించడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్స్ స్థాయికి చాలా తక్కువ కాలంలో చేరుకుంది.

ఇప్పుడు కూడా రష్మిక మందన అదే రేంజ్ లో కెరియర్ను కొనసాగిస్తుంది. ఇంతకాలం పాటు ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటిస్తూ వచ్చిన ఈమె ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. అందులో భాగంగా రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తున్న ఈమె మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్  మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తనకు ఓ విషయం అస్సలు నచ్చదు అని, అది బయట కూడా నచ్చదు. అదే సినిమాలో ఆ సన్నివేశం చేయాల్సి వచ్చిన అది అస్సలు చేయను. చివరకు సినిమా అయినా వదిలేస్తాను కానీ ఆ సన్నివేశం చేయను అని చెప్పుకొచ్చింది.

తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... నాకు రియల్ లైఫ్ లోనూ మరియు సినిమాలోను స్మోక్ చేయడం అస్సలు నచ్చదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేను ఆన్ స్క్రీన్ లో కొన్ని పనులు చేయకూడదు అని హద్దులు కూడా పెట్టుకున్నాను. దానిలో స్మోకింగ్ ఒకటి. స్మోకింగ్ చేయాల్సిన సన్నివేశం మూవీ లో ఉంటే ఆ సన్నివేశం అస్సలు చేయను. చివరకు సినిమా ఆఫర్ అయిన వదులుకుంటాను కానీ ఆ సన్నివేశంలో నటించను అని రష్మిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm