
భక్త కన్నప్ప ఊరు రాజం పేట మండలంలోని ఊటుకూరు అని తెలుస్తుంది. ఆ ఊరిలోని స్వామి వారి విగ్రహానికి భక్త కన్నప్ప పూజలు చేసినట్లు, ఆయన అక్కడే నివసించినట్లు ఆధారాలు కూడా లభించడంతో భక్త కన్నప్ప ది రాజం పేట మండలంలోని ఊటుకూరు అని తెలుస్తోంది. ఊటుకూరు గ్రామాన్ని పూర్వం ఉడువ్యూరు అని పిలిచేవారు అని తమిళనాడుకు చెందిన శేక్కిలారాముని రాసిన శివ భక్తుల చరిత్రలో పేర్కొన్నారు. అందులో భక్త కన్నప్ప కు సంబంధించిన గాధ కూడా ఉంది. అలాగే ఆయన నివసించింది ఊటుకూరు అని అందులో పేర్కొన్నారు. ఈ విషయంపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన కోయంబత్తూరు లోని విశ్రాంత సీటీఓ పళనీ స్వామి దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి భక్త కన్నప్ప ది ఊటుకూరు అని నిర్ధారించారు. ఇకపోతే తాజాగా భక్త కన్నప్ప సినిమాలో హీరోగా నటించిన మంచు విష్ణు ఊటుకూరు గ్రామాన్ని సందర్శించారు.