
దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఇందులో హీరోయిన్ సప్తమి గౌడ, వర్ష బోలమ్మ నటిస్తూ ఉన్నారు. జులై 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.. ట్రైలర్ విషయానికి వస్తే.. నితిన్ మాట్లాడుతూ మా అమ్మ చనిపోయింది.. అప్పటినుంచి అమ్మా అయినా నాన్న అయినా అన్ని నాకు అక్కే అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. నితిన్ ని ఆడిస్తూ లయ ఉన్నట్టుగా చూపించారు..ఆ తర్వాత లయ నితిన్ ను నువ్వు ఎప్పుడు తమ్ముడు అనిపించుకోలేవంటూ నితిన్ నుంచి దూరంగా లయ వెళ్ళిపోతున్నట్లు చూపించారు.
అనంతరం చిన్న చిన్న సన్నివేశాలను చూపించిన మేకర్స్ .. తన అక్కకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని మాట ఇస్తారు. ఇక అక్కడి నుంచి ట్రైలర్ ఒక్కసారిగా యాక్షన్ లోకి మారిపోయింది. నితిన్ ఇప్పటివరకు నటించిన చిత్రాలకీ భిన్నంగా తమ్ముడు సినిమాలో యాక్షన్ సీన్స్ లో నటించినట్లు కనిపిస్తోంది. ఒక ఊరిలో జరిగే సంఘటన గురించి చూపించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో హీరో నితిన్ తో పాటుగా అటు హీరోయిన్స్ కూడా బాగా అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది. అక్క, తమ్ముడు సెంటిమెంటుతో నితిన్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నారంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. లయ కూడా తన రీయంట్రి అద్భుతమైన సినిమాతో ఇస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ట్రైలర్ తో అభిమానులను మెప్పించిన నితిన్ మరి సినిమా ఏ విధంగా సక్సెస్ అందుకుంటారో చూడాలి.