టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత అన్నదమ్ములు అనే విషయం మన అందరికీ తెలిసిం దే . వీరిద్దరూ ఎం తో అన్యోన్యం గా ఉంటూ వస్తున్నారు . ఇక చిరంజీవి స్టార్ హీరో గా మా రిన తర్వాత తన తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ను కూడా సినీ పరిశ్రమలోకి తీసుకువచ్చాడు . ఆయన కూడా మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగా డు . ఇకపోతే ప్రస్తుతం పవన్ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతున్నాడు. కొంత కాలం క్రితం పవన్ రాజకీయాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత ప్రత్యేకంగా వచ్చి తన సోదరుడు అయినటువంటి చిరంజీవి ఆశీర్వాదం ను పవన్ తీసుకున్నాడు. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియో చాలా వైరల్ అయింది. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో అన్యోన్యం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది. ఇకపోతే చిరంజీవి అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లడం, అలాగే చిరంజీవి షూటింగ్ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లడం కూడా సర్వ సాధారణంగా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ షూటింగ్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు. ఇక సడన్ గా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చిరంజీవి కూడా విచ్చేశాడు. దానితో ఒక్క సారిగా షూటింగ్ ప్రదేశం అంతా సందడి వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: