
ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే ధియేటర్స్ మంచి టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధార్ధ్ పాత్రకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు . అంతేకాదు సిద్ధార్ధ్ చిన్నా పాత్రలో నటించిన మెప్పించాడు అని ఈ చిన్నా పాత్ర ఆయనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు . కొంతమంది 3BHK అనేది కేవలం ఒక మూవీ కాదు అని అదొక ఆశా కిరణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు . ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి నిరంతరం ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే .. ప్రతి దాంట్లో అపజయం ఎదురవుతూ ఉంటే ..ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది..? అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉంటుంది..? ఏం చేయాలనుకుంటాడు..? అనే దానిపై డైరెక్టర్ చాలా ఎమోషనల్ గా ఈ సినిమా తెరకెక్కించారు అంటున్నారు .
అంతేకాదు మనిషికి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అనే ఆశను కలిగించే చిత్రమే ఇది . మనకు నిత్యం ఎదురై సంఘటనలు ఎన్నో ఈ చిత్రంలో డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే సినిమాపై కొంచెం నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తుంది .ఎమోషనల్ సీన్స్ లో సిద్ధార్ధ్ బాగా నటించాడని .. మిగతా నటీనటులు కూడా బాగా నటించి ఉంటే బాగుండేది అని ..మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించారు అని ఓవరాల్ గా సినిమా ఖచ్చితంగా ఒకసారి థియేటర్లో అయితే చూడొచ్చు అని ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని.. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కుర్రాడికి ఈ సినిమా కథ కనెక్ట్ అవుతుంది అని.. ఫీల్ గుడ్ ఎమోషనల్ సెంటిమెంట్ స్టోరీ అంటూ రివ్యూలు ఇస్తున్నారు . మొత్తానికి సిద్ధార్ధ్ చాలా కాలం తర్వాత హిట్ అందుకున్నాడు అనే చెప్పాలి .చూడాలి మరి మొదటి రోజు ఈ 3BHK కి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో...??