ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ లా మారిపోయింది . ఒకప్పుడు సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూ కొత్త మూవీస్ లో ఆ పాటలు పెడుతున్నారు కొంతమంది డైరెక్టరు . అయితే ఇప్పటివరకు ఇలా వేరొక స్టార్ హీరో నటించిన సినిమాలోని సాంగ్స్ ను ఇంకొక యంగ్ హీరో వాడుకోవడం జరిగింది.  కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా సరికొత్తగా ట్రెండ్ సృష్టిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి . ఆయన సొంత సినిమాలోని సాంగ్ ఆయన రీమిక్స్ చేసుకోబోతున్నారు.  అది కూడా మెగా ఫ్యాన్స్ ఆల్ టైం ఫేవరెట్ హిట్ సాంగ్ లల్లో ఒకటి.


దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ పాట మరేంటో కాదు "అన్నయ్య" మూవీలోని "ఆట కావాలా పాట కావాలా" ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ప్రతి ఒక్క యంగ్ స్టర్ కి బాగా నచ్చేస్తుంది . మరీ ముఖ్యంగా మంచంలో ఉన్న ముసలోళ్లకు సైతం ఊపు తెప్పించే పాట ఇది. ఈ పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది . ఏ సినిమా స్కూల్ అనివర్సరీ అయినా.. ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా .. ఈ పాట ఉండాల్సిందే . చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల వరకు చాలా చక్కగా ఈ పాటని ఎంజాయ్ చేశారు.



అయితే ఇప్పుడు ఈ పాటని విశ్వంభర సినిమాలో రీమేక్ చేయబోతున్నారట మెగాస్టార్ చిరంజీవి.  దీనికి సంబంధించి అన్ని పనులు కూడా పూర్తి చేసేసుకున్నారట . మరీ ముఖ్యంగా ఈ సాంగ్ కోసం హాట్ బ్యూటీ మౌని రాయిని రంగంలోకి దించబోతున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్  బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం నో డౌట్ విశ్వంభర సినిమా వేరే లెవెల్ హిట్టు అందుకోవడం పక్క అంటున్నారు అభిమానులు . అంతేకాదు ఆల్రెడీ వశిష్ట ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ గురించి ఎంత హైలెట్ చేస్తూ మాట్లాడారు  అనేదిఅందరికీ తెలిసిందే . ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి "జగదేకవీరుడు అతిలోకసుందరి" లాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.  ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ పై స్పష్టత ఇవ్వలేదు డైరెక్టర్ వశిష్ట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: