తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు అయినటువంటి సిద్ధార్థ్ , శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా నటులుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ ఇద్దరు నటులు తాజాగా 3 BHK అనే సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పోవడంతో ఈ మూవీ బృందం తాజాగా పాత్రికేయులతో ముచ్చటించింది.

పాత్రికేయుల సమావేశంలో భాగంగా ఈ మూవీ యూనిట్ కి ఓ ఆసక్తికరమైన  ఓ ప్రశ్న ఎదురయింది. ఈ మూవీ యూనిట్ కి తాజా పాత్రికేయుల సమావేశంలో భాగంగా ప్రస్తుతం మల్టీ ప్లెక్స్ థియేటర్లలో పాప్ కార్న్ ధర దాదాపు 250 రూపాయలుగా ఉంది. అది కరెక్టేనా అనే ప్రశ్న ఎదురయింది. దానికి సిద్ధార్థ్  సమాధానం చెబుతూ ... మల్టీ ప్లెక్స్ థియేటర్లలో పాప్ కార్న్ ధర 250 రూపాయలు ఉండడం సరైనదే. ఎవరైనా కొనలేని స్తోమత ఉన్న వారు దానిని కొనకుండా ఉంటే సరిపోతుంది అని సమాధానం ఇచ్చాడు.

ఇక శరత్ కుమార్ దానికి సమాధానం చెబుతూ ... మల్టీ ప్లెక్స్ లలో పాప్ కార్న్ ధర భారీగా ఉండడం కరెక్ట్ అయిన విషయం కాదు. కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్ళినట్లయితే వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకే పాప్ కార్న్ ధర మల్టీ ప్లెక్స్ లో కాస్త తక్కువ ఉంటే బెటర్ అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న 3 BHK  మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: