యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఏ రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు దానికి కొన్ని రోజుల ముందు నుండే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలాగే ఆయన అభిమానులు సినిమా విడుదల రోజు థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సందడి వాతావరణన్ని ఏర్పరుస్తూ ఉంటారు. ఈయన సినిమాకు హిట్ , ప్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు వస్తూ ఉంటాయి.

అదే తారక్ నటించిన సినిమాకు మంచి టాక్ గనుక వచ్చినట్లయితే థియేటర్ల దగ్గర చాలా రోజుల పాటు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతూ ఉంటాయి. టెంపర్ మూవీ దగ్గర నుండి తారక్ నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించింది. దానితో ఈయన నటిస్తున్న ప్రతి మూవీ పై తారక్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా మంచి అంచనాలు పెట్టుకుంటున్నారు. తారక్ ఫస్ట్ టైమ్ వార్ 2 అనే హిందీ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకి చాలా రోజులు ఇంకా మిగిలి ఉంది. కానీ ఇప్పటి నుండే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద క్రేజ్ ఏర్పడింది.

దానితో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ స్పెషల్ షో స్ గురించి ఇప్పటి నుండే హంగామా మొదలైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా స్పెషల్స్ షో స్ కోసం ఇప్పటికే థియేటర్ యాజమాన్యాలతో  సంప్రదింపులు జరుగుతున్నట్లు , అందులో కొన్ని ఒప్పందాలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇలా వార్ 2 గురించి ఇప్పటి నుండి పెద్ద ఎత్తున థియేటర్స్ కోసం , స్పెషల్స్ కోసం థియేటర్ యాజమాన్యాలు ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: